బ్రేకింగ్ న్యూస్: జగన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జనసేన పార్టీ

Thursday, November 21st, 2019, 11:38:54 AM IST

జనసేన పార్టీ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది. రాజోలు నుండి జనసేన పార్టీ తరపున ఒకే ఒక్క సీటు గెలిచినప్పటికీ జనసేన తన ప్రజా పోరాటాన్ని ఆపడం లేదు. జగన్ చేస్తున్న ప్రతి పనిలోనూ నిఘా పెట్టింది. అవినీతి, అన్యాయాలు జరగకుండా ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా జనసేన పార్టీ ప్రభుత్వం ఫై ప్రశ్నలు కురిపిస్తుంది. అయితే జగన్ ఇప్పటివరకు చేసిన పనుల ఫలితం ఎలా ఉందొ జనసేన పార్టీ సోషల్ మీడియా లో వ్యక్త పరిచింది.

జగన్ రెడ్డి పాలన దేశానికే వేదన అంటూ జనసేన జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జాతీయ గీతాన్ని అగౌరవ పరచడం, జాతీయ జెండాకు రంగులేయడం, దేశం గర్వించే వ్యక్తులని అవమానించడం, దేశాన్ని కోర్టుకి లాగడం, దేశానికి పెట్టుబడులు రాకుండా చేయడం వంటి సంచలన ఆరోపణలు జనసేన పార్టీ చేసింది. అయితే జనసేన చేస్తున్న ఈ వ్యాఖ్యల ఫై వైసీపీ కార్యకర్తలు, అభిమానులు గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జనసేన ఒకే ఒక్క సీటు కలిగిన పార్టీ అయినప్పటికీ వైసీపీ నేతలు పవన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం గమనార్హం.