బిగ్ న్యూస్: మరొకసారి పవన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన రాపాక

Thursday, February 27th, 2020, 01:16:12 PM IST

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరొకసారి పవన్ కళ్యాణ్ ఫై, పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్, తాను ఈ మధ్య కాలంలో కలవలేదని, ఎటువంటి సమాచారం రాలేదని రాపాక వరప్రసాద్ అన్నారు. తాను జనసేన పార్టీకి దూరంగా లేను, దగ్గరగా లేను అని అన్నారు. జనసేన ఎమ్మెల్యే గానే ఉన్నానని మీడియా తో తెలియజేసారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు తెలుపుతానని ముందే చెప్పానని రాపాక వరప్రసాద్ అన్నారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన బావుందని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కు మద్దతు తెలుపుతున్నా అని అన్నారు. విశాఖపట్టణం రాజధానిగా ఉంటె గోదావరి ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని రాపాక అన్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు రాపాక వ్యతిరేకంగా తన అభిప్రాయాల్ని అసెంబ్లీ లో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ పరంగా దూరంగా, దగ్గరగా లేను అని చేసిన రాపాక వ్యాఖ్యలు మరొకసారి జనసేన పార్టీ లో కలకలం సృష్టిస్తున్నాయి.