జగన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జనసేన

Wednesday, November 13th, 2019, 08:40:51 AM IST

జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై జనసేన ప్రశ్నల యుద్ధం మొదలైంది. పలు నిర్ణయాలలో జనసేన ముందుండి చాల పోరాటాన్ని సాగిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకుండా చాల వున్నాయి. అయితే ఆ విషయాలన్నింటిని తెలియజేసేలా జనసేన కొన్ని చర్యలు తీసుకుంటుంది. మరుగుదొడ్లు లేని సర్కార్ బడి అంటూ క్యాప్షన్లు పెట్టి జగన్ ప్రభుత్వం పై ప్రశ్నలు గుప్పిస్తుంది.

ప్రభుత్వ పాఠశాలలో ఇక పై ఇంగ్లీష్ మీడియం అని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని జనసైనికులు వ్యతిరేకించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది?ఉపాధ్యాయులు ఎంతమంది?అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ముందు తెలుసుకోండి. ఆ తరువాత ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఆలోచిద్దాం అని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలో చాల దయనీయ పరిస్థితి ఉందని తెలిపేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. అయితే ఇలాంటివి చాలానే వున్నాయి అన్నట్లుగా జనసైనికులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే పలు చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.