జనసేన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తారా?

Friday, October 18th, 2019, 09:41:02 AM IST

జనసేన పార్టీ చేస్తున్న పోరాటాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. జనసేన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. మీడియా కు సంకెళ్లు వేస్తూ ప్రభుత్వం పై ఎవరైనా విమర్శించినా, గర్వ భంగం కలిగించిన 24 గంటల్లో కేసులు పెట్టండి అంటూ చేసిన వ్యాఖ్యల పై జనసేన స్పందించింది. గత ప్రభుత్వం పై ఎంతో పరిపూర్ణంగా పోరాడిన జగన్ ఇపుడు ఇలా అనడం పట్ల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దండెత్తండి అన్నారు, నేడు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే దండిస్తామని అంటున్నారు. మీరంటే ఒక న్యాయం, మిమ్మల్ని అంటే ఒక న్యాయమా? జగన్ గారు అంటూ ప్రశ్నించింది జనసేన.

జగన్ ఇప్పటివరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇవ్వకుండా పాలనా వ్యవహారం లో బిజీగా గడుపుతున్నారు. అందుచేతనే తాను కాకుండా వైసీపీ నేతలు ప్రతి పక్షాల పై విమర్శలు చేస్తూ వున్నారు. వైసీపీ పై ఇక అసత్య ప్రచారాలు చేయకుండా, మీడియా పై ఇలాంటి చర్యలు తీసుకోండి, కేసులు పెట్టండి అని అందం జరిగింది. ఒక పక్క జగన్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ పై అదే తరహాలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాల్లో తల దూర్చి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏబీఎన్, పలు మీడియా లను బహిష్కరించండి అని పిలుపునిచ్చారు. ఆ విషయాల్ని గుర్తు చేస్తున్నారు జగన్ అభిమానులు.