జనసేన షోషల్ మీడియా అకౌంట్లు సస్పెండ్…ఆందోళనలో అభిమానులు

Wednesday, September 18th, 2019, 10:57:51 AM IST

జనసేన పార్టీని జనంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో అందరికీ తెలిసిందే. టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల పరంగా జనసేనకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వకుండా తొక్కేశారు. ఇప్పటికీ అదే పరిస్థితి. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియానే ప్రధాన మాధ్యమంగా చేసుకుని తమ గొంతుకను వినిపిస్తున్నారు.

పార్టీకి సంభందించిన ఏ వ్యవహారమైనా సోషల్ మీడియా ద్వారానే బయటికొచ్చేది. ఇప్పుడు ఆ సోషల్ మీడియా అకౌంట్లనే సస్పెండ్ చేశారు. నిన్న ఒకరోజులోనే అభిమానులు స్వచ్ఛందంగా నడుపుతున్న వందల అకౌంట్లు సస్పెండ్ అయ్యాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ కుట్ర వెనుక అధికార పార్టీ వైకాపా హస్తం ఉందని, కావాలనే సోషల్ మీడియాలో తమ గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.