జనసేన మాట..ఏపీ ప్రజలు గొర్రెలా?ఎందుకీ ఘాటు మాట?

Thursday, September 19th, 2019, 01:47:44 PM IST

ఏపీ రాజకీయాల్లో ఉన్నటువంటి మూడు బలమైన పార్టీలలో జనసేన పార్టీకు ఉన్నంత సోషల్ మీడియా బలం మరే ఇతర పార్టీకు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే గత రెండు రోజుల క్రితం జనసేన సోషల్ మీడియా విభాగం అంతా ఒక్కసారిగా స్తంభించింది.కేవలం జనసేన పార్టీకు చెందిన ట్విట్టర్ హ్యాండిల్స్ మాత్రమే సస్పెండ్ కావడం అనేక అనుమానాలకు దారి తీసింది.

తెలుగుదేశం పార్టీవ్ కానీ మరే ఇతర పార్టీల తాలూకా హ్యాండిల్స్ కానీ సస్పెండ్ కాకపోవడం చాలా ఆశ్చర్యన్ని కలిగించడంతో ఈ పని ఖచ్చితంగా వైసీపీయే చేయించిందని అనుమానాలు వ్యక్తం చేసారు.అయితే జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం చాలా నిక్కచ్చిగా రెండు పార్టీలపైనా ఎలాంటి దురుసు పదజాలం వినియోగించకుండా విమర్శలు చేస్తారు.కానీ ఇదంతా వైసీపీ డైరెక్షన్ లో జరిగిందని తెలిసిందో ఏమో ఇప్పుడు మాత్రం ఇంకాస్త ఎక్కువగానే టార్గెట్ చేస్తున్నారు.

అందులో భాగంగానే జనసేన “శతగ్ని” టీమ్ ఏపీ ప్రజలను గొర్రెలతో పోలుస్తున్నారు.అయితే ఇలా వీరు అనుకున్నట్టుగా కాకుండా అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ఏపీ ప్రజలను ఆ దృష్టిలో చూస్తుంది అన్నట్టుగా తెలుపుతున్నారు.నిన్న వైసీపీకు చెందిన ఒక ఎమ్మెల్యే కొడుకు సాయంత్రం విపరీతమైన జనసంచారం ఉండే నడి రోడ్డు మీద తన అనుచర వర్గంతో ఏకంగా అతగాడి తండ్రి ఎమ్మెల్యే కారును తీసుకొచ్చి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు.

అధికారం వారి చేతిలో ఉందనో లేక తన తండ్రి ఎమ్మెల్యే కదా తనని ఎవరు ఏం చెయ్యలేరు అని భావించాడో కానీ అతని వల్ల సాయంత్రం దగ్గరగా రెండున్నర గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయిందని ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్న వారు చెప్తున్నారు.దీనినే పట్టుకొని జనసేన వారు ప్రశ్నిస్తున్నారు.వైసీపీ దృష్టిలో ప్రజలు అంటే గొర్రెల్లా కనబడుతున్నారా?అందుకే ఏమన్నా చేసుకోవచ్చు కదా అని ఆ ఎమ్మెల్యే కొడుకు అనుకుంటున్నాడు అని ఇంకో నాలుగేళ్లు వాళ్ళు చేసేవి అన్ని మూసుకొని చూడాల్సిందే అంటూ సెల్ఫ్ సెటైర్ కూడా వేశారు.