`అజ్ఞాత‌వాసి` న‌ష్టాల‌కు జ‌న‌సేన టిక్కెట్టు?

Sunday, February 18th, 2018, 10:14:08 PM IST

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `అజ్ఞాత‌వాసి` బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ల్ల ప‌లువురు పంపిణీదారులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ట్రేడ్‌లో టాక్ న‌డుస్తోంది. ఇంటా బ‌య‌టా డిస్ట్రిబ్యూట‌ర్లు ల‌బోదిబోమ‌నే పరిస్థితి నెల‌కొన‌డంతో, చిత్ర నిర్మాత రాధాకృష్ణ కొంత మొత్తం తిరిగి వెన‌క్కి ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చార‌ని ప్ర‌చారం సాగింది. పంపిణీదారుల‌తో రిలేష‌న్ షిప్ ఇంపార్టెంట్ కాబ‌ట్టి రాధాకృష్ణ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

అదంతా అటుంచితే.. అమెరికాకు చెందిన ఓ ప్ర‌ముఖ పంపిణీదారుడు త‌న‌కి వ‌చ్చిన న‌ష్టానికి బ‌దులుగా క్యాష్ తిరిగి ఇచ్చే కంటే .. జ‌న‌సేన పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిందిగా రాధాకృష్ణ‌ను కోరాడ‌ట‌. స‌ద‌రు పంపిణీదారుడు దాదాపు 10 కోట్ల మేర న‌ష్ట‌పోయాడ‌ని .. 1-2 కోట్ల మేర వెన‌క్కి ఇచ్చేందుకు నిర్మాత ముందుకొచ్చార‌ని .. ఆ క్ర‌మంలోనే స‌ద‌రు పంపిణీదారు కొత్త ప్ర‌తిపాద‌న తెచ్చాడుట‌. అంటే సినిమాల్లో పోగొట్టుకుని రాజ‌కీయాల్లో సంపాదించుకోవాల‌న్న‌ది స‌ద‌రు డిస్ట్రిబ్యూట‌ర్ నేర్పిన నీతి అన్న‌మాట‌!