జగన్ మిస్టేక్.. జనసేన ట్రోల్స్ మామూలుగా లేదుగా..!

Friday, September 20th, 2019, 08:00:55 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన మూడు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ పాలన చేపట్టి కేవలం వంద రోజులే గడిచినా అప్పుడే టీడీపీ, బీజేపీ, జనసేనలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి.

అయితే వైసీపీ, టీడీపీ కన్నా జనసేన సోషల్ మీడియా వాడకం పరంగా ముందంజలో ఉందనే చెప్పాలి. అయితే ఏదైనా అవకాశం దొరికితే చాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు జనసైనికులు. అయితే తాజాగా జగన్ ఒక తప్పు చేసి దొరకడంతో జగన్‌పై జనసైనికులు మామూలుగా ట్రోల్స్ చేయడం లేదు. తాజాగా టీటీడీ పాలకమండలిలో కొత్తగా మరో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు జగన్. అయితే వీరిలో గత ప్రభుత్వమలో టీటీడీ సభ్యుడిగా ఉన్న తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి కూడా ఉండడం గమనార్హం. అప్పట్లో ఆయనపై అవినీతి కేసులు నమోదు కావడంతో బోర్డ్ సభ్యత్వం నుంచి తొలగించబడ్డారు.

అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ శేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు బినామీ అని, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి మధ్య శేఖర్ రెడ్డి ఉండేవాడని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు ఆయనపై మద్రాస్ హైకోర్ట్ కేసులు కొట్టేయడంతో శేఖర్ రెడ్డిని జగన్ మళ్ళీ బోర్డ్ ఆహ్వానితులుగా నియమించారు. అయితే కరెక్ట్ పాయింట్‌ను క్యాచ్ చేసిన జనసైనికులు వైసీపీపై ట్రోల్స్ మొదలెట్టారు. నాడు బాబు బినామీ, నేడు జగన్ బినామీ అంటూ, అప్పుడేమో బినామీ అని, ఇప్పుడేమో టీటీడీ బోర్డ్‌లోకి తీసుకున్నాడు. టీడీపీ, వైసీపీ దొందూ దొందే అంటూ పోస్ట్‌లు పెట్టి మరీ వైసీపీ పరువు తీస్తున్నారు. ఏదేమైనా జగన్ శేఖర్ రెడ్డిని టీటీడీలోకి తీసుకోకపోయింటేనే మంచిదని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారట.