గ్యారేజ్ దూకుడు ఇంకా పెరిగిందే ?

Monday, September 19th, 2016, 09:30:16 PM IST

janatha-garage
విడుదల రోజు వచ్చిన డివైడ్ టాక్ ను తట్టుకుని ఘాన విజయాన్ని అందుకుంది ”జనతా గ్యారేజ్”. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వేగంగా వందకోట్ల మార్కెట్ ను దాటి సత్తా చాటింది. లెటేస్ట్ గా మూడో వారానికే అత్యంత వేగంగా 125 కోట్ల గ్రాస్ సాధించి .. ఎన్టీఆర్ కెరీర్ లో స్టాండర్డ్ హిట్ ని నమోదు చేసుకుంది. ఇప్పటికే 80 కోట్ల షేర్ ని రాబట్టింది. తెలుగులో అత్యంత వేగంగా వందకోట్ల మార్కెట్ ను సాధించిన ”బాహుబలి” తరువాత ఆ రికార్డును అందుకున్న చిత్రమిదే? ఇప్పటికే ఈ సినిమా పై ఇంకా అంచనాలు బాగానే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా వందకోట్ల షేర్ రాబడుతుందంటూ ట్రేడ్ టాక్ వినిపిస్తుంది. ఇక టాలీవుడ్ లో టాప్ 5 సినిమాల్లో ‘జనతా గ్యారేజ్’ 2 వ సినిమాగా నిలవడంతో ఎన్టీఆర్ ఫాన్స్ జోష్ మీదున్నారు. 3 లో ‘శ్రీమంతుడు’, 4 ‘సరైనోడు’, 5 ‘అత్తారింటికి దారేది’ చిత్రాలను క్రాస్ చేసింది.