కుర్ర‌కారు మ‌తిచెడి మంచ‌మెక్కాల్సిందే!

Wednesday, May 30th, 2018, 03:46:32 PM IST

లెజెండ‌రీ శ్రీ‌దేవి అనంత‌లోకాల‌కు ప‌య‌న‌మైనా .. త‌న వార‌సురాలిని మాత్రం కానుక‌గా అందించి వెళ్లారు. యువ‌త‌రం క‌ల‌ల‌రాణిగా జాన్వీని ప‌రిచ‌యం చేసేందుకు ఉవ్విళ్లూరినా ఆ క‌ల మాత్రం నెర‌వేర‌కుండానే మామ్ అంద‌రాని లోకాల‌కు త‌ర‌లి వెళ్లిపోయారు. ఆ ఆకస్మిక ప‌రిణామాన్ని జాన్వీ అస్స‌లు ఊహించి ఉండ‌దు. అయితేనేం.. ఈ లోకానికి తానేంటో నిరూపించి అమ్మ‌కు కానుక‌నివ్వాల‌ని ప‌రిత‌పిస్తోంది.

అయితే న‌ట‌వార‌సులు వెండితెర‌ను ఏలేసే రోజులు కావివి. ఇక్క‌డ ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. న‌టించే ప్ర‌తి సినిమాతో నిరూపించుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలాన్ని వేడెక్కించాలి. ఆ కోవ‌లోనే ప్ర‌స్తుతం `ధ‌డ‌క్‌` చిత్రం రిలీజ్‌కి వ‌స్తున్న వేళ జాన్వీ అదిరిపోయే ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత వోగ్ క‌వ‌ర్‌పేజీపై యూత్‌కి కిక్కిచ్చే రూపంతో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇదిగో ఇలా పువ్వుల‌తో డిజైన్ చేసిన ఫ్లోర‌ల్ డిజైన‌ర్ వేర్‌లో త‌ళుకులీనింది. కుర్ర‌కారు జాన్వీని ఇలా చూస్తే.. మ‌తిచెడి మంచ‌మెక్కాల్సిందే!

  •  
  •  
  •  
  •  

Comments