జన్మభూమికి ఆడియో రెడీ!

Tuesday, September 30th, 2014, 10:03:04 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టనున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన జన్మభూమి పధకాన్ని ఏపీ ప్రభుత్వం మరలా చేపట్టనుంది. ఈ నేపధ్యంగా జన్మభూమి కోసం సరోకొత్తగా నాలుగు పాటలను టిడిపి ప్రభుత్వం రూపొందించింది.

కాగా ఈ పాటలను ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారధ్యంలో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరాం రచించారు. గతంలో కూడా జన్మభూమి టైటిల్ సాంగ్ కు వందేమాతరమే సంగీతం అందించారు. ఇక చంద్రబాబు సరికొత్తగా మొదలు పెడుతున్న ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమం అక్టోబర్ 2 నుండి ప్రారంభించబడుతున్న సంగతి తెలిసిందే. కాగా తన సొంత గ్రామానికి ప్రజలు తోడ్పాటు అందిచాలన్న లక్ష్యంతో చంద్రబాబు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం నాలుగు పాటలను రూపొందించింది.