జూ.అతిలోక సుంద‌రి వ‌స్తోంది కాస్కో!

Sunday, January 21st, 2018, 02:00:57 AM IST

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌రం అయిపోయింది. ఇక కొత్త త‌రం రావాలి. న‌ట‌ వార‌సులు రావాలి. అంటే జాన్వీ రావాలి…. ఖుషీ రావాలి… ఇద్ద‌రూ అభిమానుల్ని ఖుషీ చేయాలి. అప్పుడే సాంత్వ‌న‌. అందుకే శ్రీ‌దేవి క‌నిపిస్తే చాలు మీ కూతురెప్పుడొస్తుంది? అంటూ సిగ్గు విడిచి మ‌రీ అడిగేసేవారు మీడియా వాళ్లు. శ్రీ‌దేవి కంటే కూతురిపైనే ఆస‌క్తి అంద‌రికీ. జాన్వీ ఇప్పుడొస్తుంది.. అప్పుడొస్తుంది అంటూ వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకు తెగ ఇదైపోయేది శ్రీ‌దేవి. ఏదోలా ఎట్ట‌కేల‌కు జాన్వీ వ‌స్తోంది. జాజిమ‌ల్లిలా … జాబిల‌మ్మ‌లా.. వ‌స్తోంది. క‌న్నులు విప్పార్చి.. తెరిపారా చూసుకోండిక‌.. అయితే అందుకు ముహూర్తం ఏదో తెలుసా? ఎస్‌.. జాన్వీ వ‌చ్చే రోజు.. జాబిలమ్మ వెండితెర‌పై వెలిగే రోజు.. 20 జూలై 2018. ఆ మేర‌కు రిలీజ్ తేదీ ఖ‌రారు చేశారు. జాన్వీ డార్లింగ్ న‌టించిన `ధ‌డ‌క్` రిలీజ్ తేదీని క‌న్ఫామ్ చేస్తూ నిర్మాత‌.. మెంటార్ క‌ర‌ణ్ జోహార్ లీకులందించారు.

జాన్వీ, ఇషాన్ జంట‌గా శ‌శాంక్ ఖ‌తార్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న `ధ‌డ‌క్‌` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ల‌కు ఇదివ‌ర‌కే అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. యువ‌జంట బావుంద‌న్న టాక్ వినిపించింది. ముఖ్యంగా జాన్వీ అంద‌చందాలు క‌న్నుల పండువ చేస్తున్నాయి. లేటెస్టుగా ఈ సినిమాని 20 జూన్ 2018న రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. వేరొక తేదీ అనుకున్నా కుద‌ర‌క వాయిదా వేశారుట‌. ఈ సినిమా కులాల మ‌ధ్య అంత‌రాలను ట‌చ్ చేస్తూ.. చ‌క్క‌ని ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కుతోంది. ఇద్ద‌రు టీనేజ‌ర్ల ప్రేమ‌క‌థ‌కు అమాయ‌క‌త్వం క‌ల‌బోసిన నాయ‌కానాయిక‌లు అవ‌స‌రం. అందుకు సూట‌బుల్ అనిపించిన జాన్వీ, ఇషాన్‌ల‌ను ఎంపిక చేసుకున్నామ‌ని ద‌ర్శ‌కుడు వివ‌రించారు. మొత్తానికి జాన్వీ వ‌స్తోంది అన్న మాట‌.. అభిమానుల్ని నిలువ‌నీయ‌డంలేదు సుమీ!

  •  
  •  
  •  
  •  

Comments