వామ్మో జాన్వీ! అప్ప‌డే హిస్టారిక‌ల్ సినిమానా?!

Thursday, August 9th, 2018, 02:36:01 PM IST

ధ‌డ‌క్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ ఇంకా ఆ స‌క్సెస్ ఆస్వాధించే మూడ్‌లోనే ఉంది. ఈలోగ‌నే అదిరిపోయే జాక్‌పాట్‌. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న భారీ హిస్టారిక‌ల్ 3డి చిత్రంలో ఈ భామ అవ‌కాశం అందుకుంది. ఈ సినిమా టైటిల్ `త‌క్త్‌`. త‌క్త్ అంటే సింహాస‌నం అని అర్థం. అంటే మ‌రో హిస్టారిక‌ల్ ఎపిక్ మూవీ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. అది కూడా ఈ సినిమాని నిర్మిస్తోంది క‌ర‌ణ్ జోహార్‌. బాహుబ‌లి సిరీస్‌ని రిలీజ్ చేసి భారీగా లాభ‌ప‌డిన క‌ర‌ణ్‌లో హిస్టారిక‌ల్ సినిమా ఆకాంక్ష అప్పుడే బ‌ల‌ప‌డింద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇక ఈ సినిమాలో కాస్టింగ్ అంతే స‌ర్‌ప్రైజింగ్‌. ది గ్రేట్ ర‌ణ‌వీర్ సింగ్‌.. ఇందులో హీరో. క‌రీనాక‌పూర్‌, ఆలియా భ‌ట్‌, భూమి పెడ్నేక‌ర్ వంటి స్టార్లు న‌టిస్తున్నారు. విక్కీ కౌశ‌ల్ ఓ కీల‌క‌పాత్ర పోషించ‌నున్నాడు. ఆస‌క్తిక‌రంగా ఈ ప్రాజెక్టులో జాన్వీ పేరు క‌నిపించ‌డం పెద్ద స‌ర్‌ప్రైజ్‌. ఓ ర‌కంగా క‌ర‌ణ్ త‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ ప్రామిస్‌ని నెర‌వేర్చుకుంటున్నాడ‌నే చెప్పాలి.

భాజీరావ్ మ‌స్తానీ, ప‌ద్మావ‌త్ త‌ర్వాత ర‌ణవీర్‌కి ఇదో ఛాలెంజింగ్ ప్రాజెక్ట్‌. అప్ప‌ట్లో క‌రీనా అత‌డి స‌ర‌స‌న ఛాన్స్ మిస్స‌య్యిందిట‌. ఇప్పుడు ఆ క‌సి తీర్చుకుంటోంది. ఇక‌పోతే జాన్వీకి ఇలాంటి గ్రేట్ మూవీలో అవ‌కాశం రావ‌డం చూస్తుంటే ఈ అమ్మ‌డి రేంజు ఆ లెవ‌ల్లోకి వెళ్లేట్టే క‌నిపిస్తోంది. ధ‌డ‌క్‌లో కొంటె చూపుల‌తో వ‌ల‌పు దోపిడీ చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ నెక్ట్స్ లెవ‌ల్ చూపించ‌బోతోంద‌న్న‌మాట‌!!

  •  
  •  
  •  
  •  

Comments