క్రేజీ ఆఫ‌ర్‌ : `టెంప‌ర్` రీమేక్‌లో జూ.అతిలోక సుంద‌రి

Friday, January 26th, 2018, 10:24:29 AM IST

శ్రీ‌దేవి త‌న‌య జాన్వీ క‌పూర్ `ధ‌డ‌క్‌` అనే చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా రిలీజ్‌కి ముందే జాన్వీకి విప‌రీత‌మైన క్రేజు ఏర్ప‌డిపోయింది. ఈ భామ అంటే యూత్ ఫిదా అయిపోతున్నారు. ధ‌డ‌క్ చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌లోనే పూర్తి కానుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్త‌వ్వ‌కుండానే జాన్వీ కి మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కింది.

ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా రోహిత్ శెట్టి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్క‌నున్న `సింబా` (టెంప‌ర్ రీమేక్‌) చిత్రంలో జాన్వీని క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేశారుట‌. ఆ మేర‌కు ప్ర‌ముఖ బాలీవుడ్ వెబ్ వివ‌రాలు వెల్ల‌డించింది. `ధ‌డ‌క్‌` చిత్రంలో త‌న‌లానే డెబ్యూ అయిన షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ స‌ర‌స‌న న‌టిస్తోంది. అయితే త‌న రెండో చిత్రానికి ర‌ణ‌వీర్ లాంటి క్రేజీ హీరో స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింది. ర‌ణ‌వీర్ న‌టించిన `ప‌ద్మావ‌త్‌` సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తానికి జూ.అతిలోక సుంద‌రి స్పీడు చూస్తుంటే, ఎక్క‌డికో వెళ్లేట్టే ఉంది! మ‌రోవైపు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ సైతం తొలి సినిమా రిలీజ్ కాక‌ముందే హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న `సూప‌ర్ 30` మూవీలో ఆఫ‌ర్ అందుకుంద‌న్న వార్త‌లొచ్చాయి.