పిక్ టాక్‌: మ‌ంచు కొండ‌ల్లో అంగుళీకం వెతికారా?

Sunday, September 24th, 2017, 01:01:26 PM IST

ఇంద్రుని త‌న‌య అతిలోక సుంద‌రి చేతి చిటికెన‌వేలికి ఉన్న అంగుళీకం జారి హిమాల‌యాల్లో ప‌డిపోతే ఏం జ‌రుగుతుంది? ఏం జ‌రుగుతుందో కె.రాఘ‌వేంద్ర‌రావు `జ‌గ‌దేక‌వీరుడు-అతిలోక సుంద‌రి` సినిమాలో చూపించారు. జ‌గ‌దేక వీరుడిగా మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుంద‌రిగా శ్రీ‌దేవి న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న తీరుగా జీవించేశారు. వ‌ర‌ద‌ల్లో వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు తిర‌గ‌రాసిన చిత్ర‌మిది. ఆ సినిమాలో శ్రీ‌దేవిని చూసిన‌వాళ్లెవ‌రూ ఆ దివ్య‌రూపం మ‌ర్చిపోలేరు. క‌ళ్ల‌లోనే క‌ద‌లాడుతుంది ఎన్నాళ్టికైనా.

ఇదిగో ఈ ఫోటో చూడ‌గానే అదే సీను గుర్తొస్తోంది. మంచు కొండ‌ల్లో అంగుళీకం వెతుక్కునేందుకు మ‌రోసారి అతిలోక సుంద‌రి వెళ్లిందా? అనిపిస్తోంది ఈ ఛాయాచిత్రం చూశాక‌. బుల్లి అతిలోక సుంద‌రి, కుమార్తె జాన్వీతో క‌లిసి మంచు కొండ‌ల్లో వెకేష‌న్‌కి వెళ్లిన‌ప్ప‌టి ఫోటో ఇది. ఆ మంచు కొండ‌ల్లోనే క‌దా `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` తీసింది.. అందుకే మ‌న‌సును తాకింది ఈ ఛాయాచిత్రం. ఇప్పుడు ఆ సినిమాకి పార్ట్ -2 చేస్తే చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ జాన్వీ చేస్తుందా? అన్న‌దే ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌. నేటి త‌రం రాఘ‌వేంద్ర‌రావు ఎవ‌రైనా ఇలాంటి క‌థ రెడీ చేసుకుని చ‌ర‌ణ్‌తో జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తే .. జాన్వీని నాయిక‌గా తీసుకుంటే బావుండేదేమో?

  •  
  •  
  •  
  •  

Comments