హిట్టా లేక ఫట్టా : ‘జవాన్’ ట్రెండీ టాక్..!

Friday, December 1st, 2017, 06:00:39 PM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత కొంత కాలంగా ఏ మాత్రం హిట్స్ అందుకోవడం లేదు. అయితే ఫైనల్ గా ఈ సారి ఎలాగైనా హిట్టుకొట్టాలని జవాన్ తో వచ్చాడు. బివిఎస్.రవి దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ పీర్జాద హీరోయిన్ గా నటించింది. సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు లేకపోయినా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కొంచెం ఎక్కువగా చేయడంతో క్రేజ్ ఏర్పడింది.

యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమా కథ కొంత వరకు బాగానే ఉన్నా కూడా తెరకెక్కించే విధానంలో దర్శకుడు కొంచెం జాగ్రత్తగా ఉంటె సినిమా ఇంకా బావుండేది. సినిమాలో సాయిధరమ్ తేజ్ నటన చాలా బావుంది, ముఖ్యంగా యాక్షన్స్ సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. అలాగే సాంగ్స్ లో వేసిన కొన్ని స్టెప్పులు కూడా చాలా బావున్నాయి. అయితే సెకండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. ఇక హీరోయిన్ మెహ్రీన్ నటన పర్వాలేదు. విలన్ ప్రసన్న నటన అయితే సూపర్బ్ అని చెప్పవచ్చు. సెకండ్ ఆఫ్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా చాలా బావున్నాయి. అదే విధంగా హీరో విలన్ మధ్య వచ్చే మైండ్ గేమ్ ఎపిసోడ్స్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్.

 

దేశం కోసం పోరాడే యువకుడి కథ

Reviewed By 123telugu.com |Rating : 3.25/5

మంచి ప్రయత్నం

Reviewed By chitramala.in |Rating : 2.5/5

జవాన్.. జస్ట్ ఓకే థ్రిల్లర్!

Reviewed By tupaki.com |Rating : 2.75/5

తీర్పు: ధరం తేజ్ యొక్క ధృవ!

Reviewed By gulte.com |Rating : 2.75/5

అవకాశం వృధా

Reviewed By mirchi9.com |Rating : 2.25/5


 

   •  
  •  
  •  
  •  

Comments