జయలలిత మరణం మీద అందరికీ అనుమానాలు

Saturday, December 31st, 2016, 11:15:25 AM IST

jayalalitha1
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మీద తమిళ జనాల దగ్గర నుంచీ ఇక్కడ తెలుగువారు వరకూ ఎందరికో ఎన్ని ఆలోచనలూ, సందేహాలూ ఉన్నాయి. తాజాగా అక్కడి హై కోర్టు సైతం వ్యక్తిగతంగా తమకీ అనుమానాలు ఉన్నాయి అనీ టీవీలలో, పేపర్ లలో ఆమె కోలుకుంటోంది అనే వార్తలు చూసిన కొన్ని రోజులకే ఆమె చనిపోయారు అనే చేదు నిజం బయటకి వచ్చింది అనీ ఈ మధ్యలో ఆమె ఆరోగ్యానికి ఏమైంది అనేది తెలియలేదు అంటూ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన తరవాత ఇప్పుడు ప్రతిపక్షం డీఎంకే కూడా జయ మరణం మీద వ్యాఖ్యలు చేసారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డీఎంకే పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐఏడీఎంకే మాజీ అధినేతకు జరిగిన వైద్య వివరాలు – పూర్తి మెడికల్ బులిటెన్ లు – వీడియో ఫుటేజీ – ఆస్పత్రిలో వైద్యం పొందుతుండగా ఆమె ఫోటోలు తదితరాలన్నింటినీ విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments