ఆసుపత్రి నుంచే ‘అమ్మ’ పాలన .. క్యాంటీన్ లూ , వైఫై లూ ప్రారంభం

Wednesday, September 28th, 2016, 04:08:53 PM IST

jayalalitha2
కొంతమంది అంతే ప్రజల పిచ్చోళ్ళు , ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. తమ ఆరోగ్యం ఎంత దారుణంగా అవుతున్నా పట్టించుకోరు, ప్రజల మీద ప్రేమ చూపిస్తూనే ఉంటారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే . చెన్నైఅపోలో ఆసుపత్రి లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు, అయినా సరే ఆమె రెస్ట్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఆసుపత్రి బెడ్ పై నుంచే మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కావేరీ నీటి విషయం గురించి వివాదం ముదరకుండా చూసుంటున్నారు . కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశం నిర్వహించాల్సివుండగా, దానికి తన బదులుగా ప్రజా పన్నుల శాఖ మంత్రి పళనిస్వామిని పంపుతూ, తన తరఫున మాట్లాడాలని కోరారు. గడిచిన మూడు రోజుల వ్యవధి లో 107 కొత్త అమ్మ క్యాంటీన్ లు ప్రారంభం అయ్యాయి అని మంత్రులు ఆమెకి చెప్పగా ఆమె చాలా సంతోషపడ్డట్టు తెలుస్తోంది. ఆసుపత్రి నుంచే అమ్మ కొత్తగా ప్రారంభం అయిన వైఫై జోన్ పథకం ప్రారంభించారు. స్థానిక ఎన్నికల్ సంస్థలు జరగబోతున్నందున ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి అనే జాబితాని స్వయంగా పరిశీలన చేసారట ఆమె . వారం రోజులుగా తీవ్రమైన జ్వరం , డీ హైడ్రేషన్ లకి చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు . ఆమెని సింగపూర్ తీసుకుని వెళ్తున్నారు అనే వార్తల్లో నిజం కూడా లేదు అని అపోలో బృందం అంటోంది.