షాకింగ్ న్యూస్ : జయలలిత సమాధి ముట్టుకుంటే షాక్ కొడుతోంది !

Wednesday, December 28th, 2016, 12:33:44 PM IST

jayalalita-grave
తమిళనాడు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని విధంగా రాజ్యం ఏలి ముఖ్యమంత్రి గానే చనిపోయిన జయలలిత పార్థివ దేహం చెన్నయి లోని మెరీనా బీచ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఆమె అభిమాని, అన్నా డీఎంకే కార్యకర్త అయిన ఒకామె సమాధి దగ్గరకి వెళ్లి నివాళులు అరిపిస్తున్న టైం లో ఆమెకి గట్టిగా కరంట్ షాక్ తగిలింది. అక్కడే ఉన్న విద్యుత్ వైరు ఆమె కాలు మీద పడి ఈ ఘటన జరిగింది. వ్యాసర్ పాడి సమీపంలోని కన్నిగ పురం గ్రామానికి చెందిన గుణ సుందరి అనే 32 సంవత్సరాల యువతి, జయలలితకు నివాళులు అర్పించేందుకు వచ్చిందని, తిరిగి వెళుతున్నప్పుడు ఆమెకు షాక్ కొట్టగా, కాలికి, చేతులకు కాలిన గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఆమెను రాజీవ్ గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తున్నామని, కేసు నమోదు చేశామని వెల్లడించారు. జయలలిత సమాధి దగ్గర ఈ దుర్ఘటన జరగడం తో జయ సమాధి షాక్ కొడుతోంది అంటూ చుట్టుపక్కల పెద్ద ప్రచారం జరుగుతోంది .

  •  
  •  
  •  
  •  

Comments