లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.బలమైన నాయకత్వాన్ని తీసుకొచ్చేందుకు తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు ఆయన ఈ రోజు గుంటూరులో ప్రకటించారు. అయితే.. తాను రాజకీయాలలోనుంచి తప్పుకోవడం లేదని.. లోక్ సత్తాపార్టీని బలమైన పార్టీగా తయారుచేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో తాను పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన వ్యాఖ్యాలతో ఏకీభవిస్తానని, ఏపి ప్రత్యేక ప్రతిపత్తి సాధ్యం కాదని ఆయన అన్నారు. లోక్ సత్తా పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తానని జయప్రకాశ్ నారాయణ తెలియజేశారు.
జయప్రకాశ్ నారాయణ రాజీనామా
Sunday, September 14th, 2014, 05:38:29 PM IST