బిగ్ బ్రేకింగ్: జగన్ మార్క్ పాలనపై మరోసారి జేసీ సంచలన వ్యాఖ్యలు..!

Monday, July 22nd, 2019, 04:32:21 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే, టీడీపీ మాత్రం ఘోర పరాభవాన్ని చవి చూసింది. అయితే ఈ ఎన్నికలలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో ఉన్నా గెలుపు మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే కనిపించింది. అయితే ఎన్నికలకు ముందు అందరూ అనుకున్న అంచనాలను, సర్వే ఫలితాలను తలదన్నేలా వైసీపీ ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాలను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం కేవలం 23 స్థానాలకే పరిమితమైంది.

అయితే రాష్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల తరువాత పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే జేసీ దీనిపై స్పందిస్తూ పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పినా అప్పుడప్పుడు ఆయన మాటలు వింటుంటే పార్టీనీ వీడుతారేమోనన్న సందేహాలు ప్రజలలో కలుగుతున్నాయి. అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం జేసీకి అలవాటు. అయితే గత కొద్ది రోజులుగా జగన్ పాలనను గురుంచి మాట్లాడుతూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయి కానీ తన పాలన గురుంచి మాట్లాడాలంటే ఇంకా కొద్ది రోజులు సమయం కావాలి అని అన్నాడు. అయితే తాజాగా ఈయన మీడియాతో మాట్లాడుతూ జగన్ మార్క్ పాలనపై స్పందించాడు. సీఎంగా జగన్ మంచి నిర్ణయాలే తీసుకుంటున్నా వాటి అమలులో మాత్రం కాస్త జాప్యం జరుగుతుందని, తాను ఎన్నికలలో ఇచ్చిన చాలా హామీల గురుంచి ఇంకా స్పష్టత ఇవ్వలేదని ఇది ఇలాగే కొనసాగితే ప్రజలలో కాస్త అసంతృప్తి ఏర్పడుతుందని మాట్లాడాడు. అయితే ఏది ఏమైనా వీలైనంత త్వరగా హామీల అమలు చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది.