బ్రేకింగ్: జగన్ గెలుపుపై జేసీ సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, October 15th, 2019, 07:40:11 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ అధికారం చేపట్టి నాలుగు నెలలే గడిచినా అప్పుడే టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తుంది.

అయితే రాష్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల తరువాత పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే జేసీ దీనిపై స్పందిస్తూ పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పినా అప్పుడప్పుడు ఆయన మాటలు వింటుంటే పార్టీనీ వీడుతారేమోనన్న సందేహాలు ప్రజలలో కలుగుతున్నాయి. అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం జేసీకి అలవాటు. కొద్ది రోజుల క్రితం జగన్ 100 రోజుల పాలనపై స్పందించిన జేసీ జగన్ ప్రభుత్వానికి పలు సూచనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి జగన్ పాలనపై స్పందించిన జేసీ సీఎం జగన్ పాలన గురుంచి చెప్పాలంటే మరో ఆరు నెలలు సమయం పడుతుందని అన్నారు. అంతేకాదు ప్రధాని మోదీ కారణంగానే జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించారని, ఆయన వలనే అధికారం చేపట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే సీఎం జగన్‌కు పెద్దగా అనుభవం లేదని ఆయనకు మంచి, చెడు ఏదో చెప్పే వారు కరువయ్యారని అందుకే ఆయన పాలనలో మంచి, చెడు రెండు వినిపిస్తున్నాయని వీటన్నిటిని అధిగమించి జగన్ ఎలాంటి పాలన అందిస్తాడో తెలియాలంటే మరో ఆరు నెలలు వేచి ఉండాల్సిందే అని అన్నారు. అయితే మోదీ కారణంగానే జగన్ అధికారంలోకి వచ్చాడని జేసీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.