సోనియాకు లాభం చేకూరిందా..?

Tuesday, October 7th, 2014, 12:30:06 AM IST


రాష్ట్రం రెండుగా విడిపోవడానికి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధినే కారణమని అనంతపురం ఎంపి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సోనియా గాంధి తన కొడుకు రాహుల్ గాంధిని ప్రధానిని చేయాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర విభజనకు పూనుకున్నదని దివాకర్ రెడ్డి అన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం యూపీఏ తీసుకున్న నిర్ణయాలే అని ఆయన తెలిపారు. ఇంతాచేసి, రాష్ట్రాన్ని విభజిస్తే.. అటు ఇటు రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ తిరస్కారానికి గురయిందని… దేశంలో అత్యంత కనిష్ట స్థాయిలో సీట్లు గెలుపొందిందని జేసీ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుని రుణమాఫీలు చేయలేదని విమర్శించడం సరికాదని, రుణాల మాఫీ చేస్తాడని, ప్రజలు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయలేదని, చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నేత కావడం, గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయడం వలన… బాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించారని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేశారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.