గోరంట్ల మాధవ్ గెలుపుపై జేసీ సంచలనం.!

Tuesday, June 4th, 2019, 11:13:31 AM IST

గత ఏడాది ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నో సంచలన సంఘటనల్లో అనంతపూర్ జిల్లాలోని అప్పటి మంత్రి అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డికి మరియు అక్కడి సీఐ అయినటువంటి గోరంట్ల మాధవ్ కు జరిగిన యుద్ధం వేరే స్థాయి అని చెప్పాలి.ఈ ఇద్దరి మధ్యన మాటల దాడి సవాళ్ల వరకు వెళ్లి నాలుక తెగ్గోస్తా అనేంత వరకు వెళ్ళింది.దీనితో ఈ ఇద్దరి మధ్యన గొడవ అప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది.అదలా ఉండగా గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరి అక్కడ నుంచే ఎంపీగా పోటీ చేసిన మొట్ట మొదటి సారే ఎన్నికల్లో గెలిచి చూపించారు.

ఇది ఒక సంచలనాత్మక గెలుపుగా వారు భావించారు.అయితే అక్కడ గెలుపొందిన గోరంట్ల మాధవ్ విజయం పై జేసీ దివాకర్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.ఆ సమయంలో మాధవ్ ఏదో ఆవేశంగా మాట్లాడారని నిజానికి వారిద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వాలు లేవని వ్యక్తిగతంగా అస్సలు ఎలాంటి విభేదాలు లేవని నిజానికి అతను పోలీసు అధికారిగా ఉన్నపుడు అతనికి నేను అన్ని రకాల సహాయ సహకారాలు అందించానని చెప్పుకొచ్చారు.అతను అప్పుడేదో ఆవేశంగా మాట్లాడాడని ఇప్పటికీ అదే అనుకుంటున్నాను తప్ప అతని గెలుపుపై పెద్ద ప్రాధాన్యత ఇవ్వదల్చుకోలేదని తేల్చేసారు.