బిగ్ బ్రేకింగ్ : జగన్ మావాడే అంటూ పార్టీ మార్పుపై జేసీ సంచలన నిర్ణయం.!

Monday, June 3rd, 2019, 11:58:50 PM IST

తెలుగుదేశం పార్టీలో ఎలాంటి బెరుకు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది మాజీ మంత్రి అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డే అని అంటారు అందరు.ఆ మధ్య జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై సంచలనానికి దారి తీసిన కామెంట్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరమైన పరాజయం పాలు కావడంతో జేసీ బాగా నెమ్మదించారు. తాజాగా నవ యువ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ పై చేసిన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

ఇక తాను రాజకీయాలకు పూర్తిగా దూరం కాబోతున్నాని ఒక బాంబు పేల్చడంతో పాటుగా జగన్ పై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.జగన్ అఖండ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని అలాగే జగన్ మోడీతో వ్యవహరించిన తీరు శుభ పరిణామం అని వ్యాఖ్యానించారు. జగన్ పై తాను ఎప్పుడు వ్యక్తిగతమైన విమర్శలు చెయ్యలేదని రాజకీయ పరమైన విమర్శలే అతని పై చేసానని అన్నారు.అంతే కాకుండా జగన్ మావాడే అన్న మాట మాత్రం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.జేసీ ఎందుకు ఇలా అంటున్నారా అన్నది ఆయనకే వదిలిపెడితే తాను మాత్రం వేరే ఏ పార్టీలోనూ చేరబోడం లేదని క్లారిటీ ఇచ్చారు.