జగన్ కు దమ్ముంటే తాను రెడ్డి అని ప్రకటించాలంటున్న జేసీ

Monday, January 23rd, 2017, 12:35:25 PM IST

jc
ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి. కొన్ని రోజుల క్రితం రాయలసీమ రెడ్డి లపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొంతమంది ఆగ్రహానికి గురయ్యారు. కొన్ని రోజుల తరువాత ఆ వ్యాఖ్యల వేడి తగ్గుతుందనగా మరొకసారి లాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లోకి ఎక్కారు. రాయలసీమలో తాను ఒక్కడినే రెడ్డిని అని, రాజకీయనేతల్లో రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారు ఎవరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ కు దమ్ముంటే అతను రెడ్డి అని ప్రకటించాలని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సగర్వంగా రెడ్డిని అని చెప్పుకునేది తాను మాత్రమే అని చెప్పారు. తనకు ఇతర కులాలు, మతాల వారంటే ద్వేషం లేదని, కానీ రెడ్డి కులస్తులు ఎవరైనా తన దగ్గరకు వస్తే సాయం చేసే భావన తనలో ఉందని ఆయన అన్నారు. రెడ్డి కులస్తులే రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చారని దివాకర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముందు నుండి నెత్తి బాదుకున్నా, చేతులు పట్టుకున్నా రెడ్లు ఎవరూ పట్టించుకోలేదని ఆయన నిప్పులు చెరిగారు. కొందరు రెడ్లు రాష్ట్రాన్ని చీల్చి నాశనం చేసారని ఘాటు విమర్శలు చేశారు.