చంద్రబాబుకు మరో షాకిచ్చిన జేసీ..ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధం?

Friday, June 7th, 2019, 12:49:43 PM IST

తాను రాజకీయాలు వదిలేస్తున్నా అని అనంతపురం మాజీ తెలుగుదేశం పార్టీ మంత్రి అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి తాను ఆ పార్టీను వీడుతున్నట్టు ప్రకటన చేసి రాజీనామా చేసి తప్పుకున్నారు.అదే సందర్భంలో జగన్ పై కూడా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసి మళ్ళీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యారు.ఇదే చంద్రబాబుకు పెద్ద షాక్ అనుకుంటే ఇప్పుడు జేసీ తీసుకున్న నిర్ణయం మరో పెద్ద షాకిచ్చిందని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఊపందుకుంది.ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జేసీ దివాకర్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

అందులోను చంద్రబాబు ఏ పార్టీతో అయితే విభేదించి బయటకు వెళ్లారో అదే బీజేపీ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారట.ఇప్పటికే పలువురు కీలక నేతలతో టచ్ లో ఉన్నారని ఇక సమయం చూసుకొని అమిత్ షా సమక్షంలో కాషాయ జెండా కప్పుకొని ఆ పార్టీలో చేరనున్నారట.ఇందుకు ఇప్పటికే షా తో కూడా చర్చలు జరిపి ఒక సరైన రోజు కోసం ఎదురు చూస్తున్నారట.ఇంత అకస్మాత్తుగా టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతుండడం వెనుక కూడా ఓ ప్రధాన కారణం ఉందట.భవిష్యత్తు రాజకీయాలను పరిణగంలోకి తీసుకొని వారి పరిస్థితులను బట్టే బీజేపీలోకి అతను జంప్ అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట.