టీడీపీకి ఇక జూ.ఎన్టీఆర్ దిక్కు – జేసీ సంచలన వాఖ్యలు

Sunday, June 16th, 2019, 01:47:40 AM IST

జేసీ దివాకర్ రెడ్డి… ఈ మాజీ ఎంపీ చాలా దైర్యంగా మాట్లాడతాడని, ఎవరిని పట్టించుకోడని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడి అందరిని ఒప్పించగల సత్తా ఉన్న నాయకుడని కూడా అందరు అంటుంటారు… తానూ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తారని జేసీ కి మంచి పేరుంది. ఆయన మాట్లాడే మాటలు చుస్తే అదే నిజమని అనిపిస్తుంది కూడా… అయితే తాజాగా ఒక ప్రముఖ మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ పార్టీ గురించి మాట్లాడుతూ… టీడీపీ కి భవిష్యత్ ఉండాలంటే అదొక్కటే మార్గమని తేల్చి చెప్పేశారు… ఎప్పటికి కూడా చంద్రబాబే టీడీపీ ని సమర్థవంతంగా నడిపించగలడని, ఆయన కుమారుడికి పార్టీ బాధ్యతలు అప్పగించడం వృధా అని జేసీ అన్నారు…

ఇకపోతే ఒకవేళ టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ టీడీపీ అధికార బాధ్యతలు చేపట్టాలని, లేకపోతె టీడీపీ కి భవిష్యత్ ఉండదని రాజకీయ విశ్లేషకులు అన్నటువంటి మాటలపైనా స్పందించినటువంటి జేసీ… ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే కొన్నేళ్ళకు మంచి నాయకుడు అవ్వోచ్చేమో కానీ ఇప్పుడే తనకు అంత రాజకీయ అనుభవం లేదని జేసీ అన్నారు. అంతేకాకుండా “పవన్ కల్యాణ్ అంతటివాడికి కూడా రాజకీయాలు సరిపడవని చెప్పాను. పవన్ కు ఎంత పేరుంది? మిమ్మల్ని చూడ్డానికి జనం వస్తారే తప్ప వారంతా మీ వెంట నడిచేవాళ్లు కాదని చెప్పాను. చిరంజీవి, రోజా ఇలా ఎంతోమంది సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. తెరపై నటించే ఆ నటులను చూడ్డానికి జనం వస్తారే తప్ప వాళ్లను రాజకీయంగా ఆమోదించడం చాలా కష్టం” అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.