గ‌డ్డం చ‌క్ర‌వ‌ర్తి సీక్రెట్ మేనేజ‌ర్‌?

Thursday, May 31st, 2018, 10:43:05 AM IST

ఏం గ‌డ్డం అడ్డ‌మా? అని అడిగాడో హీరో. ఆయ‌నే గ‌డ్డం చ‌క్ర‌వ‌ర్తి. ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వ‌ర్మ ప్రియ‌శిష్యుడిగా జేడీ అంద‌రికీ సుప‌రిచితం. రామూ సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు రామూయిజాన్ని ప్ర‌పంచానికి విస్త‌రించే సంక‌ల్పంతో బ‌తికిన ఏకైక వీరాభిమాని. వ‌ర్మ శిష్యుల‌యందు జేడీ వేర‌యా విశ్వ‌ధాభిరామ వినుర‌వేమ‌!

జేడీ బాగా న‌టించిన రోజుల్లో ఫుల్లుగా సంపాదించుకుని, అంతే బాగా లైఫ్‌ని ఎంజాయ్ చేశాడు. న‌చ్చిందే చేశాడు.. న‌చ్చిన‌ట్టే బ‌తికాదు.. న‌చ్చిన‌ది త‌ప్ప న‌చ్చ‌ని ఏ ప‌నీ చేయ‌లేదు. అస‌లు త‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌ని పెళ్లిని దూరం పెట్టేశాడు. గ‌డ్డం ఎలా అడ్డు కాద‌నుకున్నాడో.. పెళ్లి అంత అడ్డు అనుకున్నాడు. మొత్తానికి జేడీ వ్య‌వ‌హారిక‌మే వేరు!
అస‌లు జేడీ ఏమ‌య్యాడు? అనుకుంటున్న వేళ మొన్న‌టికి మొన్న అత‌డు ఆఫీస‌ర్ ఈవెంట్‌లో బ్యాక్‌స్టేజ్‌లో కొద్దిమందికి క‌నిపించాడు. అయితే అస‌లు అత‌డిని ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేదుట‌. మొహం మొత్తం క‌వ‌ర్ చేసుకుని ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేశాడ‌ని వెన‌క ఉన్న‌వాళ్లు చెప్పారు. అయితే వేదిక‌పైకి ఆర్జీవీ కానీ, నాగార్జున కానీ పిల‌వ‌క‌పోవ‌డంతో అస‌లే తెలియ‌లేదు ఎవ‌రికీ. మొత్తానికి గురువుగారి కోసం జేడీ అంత త్యాగం చేశాడు. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ అతడు రామూ భ‌క్తుడే అని చెప్ప‌డానికి ఇంత‌కంటే ఎగ్జాంపుల్ అఖ్క‌ర్లేదేమో! అన్న‌ట్టు జేడీ ప్ర‌స్తుతం ఏం చేస్తున్నాడు? అంటే మ‌ల‌యాళం, త‌మిళం, క‌న్న‌డ సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా బిజీబిజీ.