వర్మ ‘ లక్షిస్ ఎన్టీఆర్’ కథకు నిర్మాత దొరికేశాడట?

Monday, September 25th, 2017, 04:58:32 PM IST

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. సినిమాలతో సంచలనాలను సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటారు. కథలో ఎంత కాంట్రవర్సీ ఉంటే అంత పబ్లిసిటీ వస్తుందని అనుకుంటారు. అయితే అదే తరహాలో అలోచించి ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా చేసుకొని లక్ష్మిస్ ఎన్టీఆర్ అనే సినిమాను తీయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే అనౌన్స్ చేసి వివాదం రేపిన సంగతి తెలిసిందే..

అయితే ఈ సినిమాను తీయడం ఒకే గాని నిర్మించే దమ్ము ఎవరుకుందని అందరు అనుకుంటున్నారు. కానీ వర్మ నిర్మాతలకి ఏం చెబుతాడో గాని వెంటనే సినిమాలను తెరకెక్కించడానికి ఒప్పిస్తాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కథను కూడా తెరకెక్కించడానికి నిర్మాత దొరికాడని కొన్ని కామెంట్స్ వినబడుతున్నాయి. వారు ఎవరో కాదు వర్మతో ఎన్నో ఏళ్ల నుండి సన్నిహితంగా ఉంటున్న జేడీ చక్రవర్తి. ఈ వివాద కథను జేడీనే నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా సిద్దమైనట్లు సమాచారం మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments