జగన్ మార్పుపై జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..!

Friday, June 7th, 2019, 07:13:59 PM IST

సీనియర్ నటుడు జేడీ చాలా రోజుల తరువాత మళ్ళీ తెరపైకి వచ్చారు. టీఎన్ క్రిష్ణా దర్శకత్వంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయ, దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హిప్పీ. ఈ మూవీలో జేడీ చక్రవర్తి ప్రముఖ పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. అయితే చాలా రోజుల తరువాత ఈ సినిమాలో జేడీ నటించిన కారణంగా పలు మీడియా సంస్థలు ఈయనను ఇంటర్వ్యూ చేస్తున్నాయి.

అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయలపై కూడా ఒక ప్రశ్న ఎదురైంది జేడీకి. అసలు ఏమిటీ ఆ ప్రశ్న అంటే ఏపీ సీఎంగా జగన్ గెలిచారు కదా అతడిపై మీ అభిప్రాయమేమిటని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు జేడీ కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఒకప్పటితో పోలిస్తే జగన్ లో చాలా మార్పు వచ్చిందని 2008 లో నాకు యాక్సిడెంట్ కావడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సమయంలో తాను విమానంలో ప్రయాణించాల్సి రావడంతో తను కూర్చున్న సీటు సౌకర్యంగా లేదని వీల్ చైర్ కావాలని సిబ్బందిని అడిగాను. ఆ సమయంలో నా పక్కన జగన్ ఉన్నారని, కనీసం నన్ను చూసి పలకరించలేదని అన్నారు. అప్పుడు జగన్ ప్రవర్తన చూసి షాకయ్యానని చెప్పారు. అయితే గతేడాది మళ్లీ ఎయిర్ పోర్ట్ లో జగన్ ని చూశానని అప్పుడు ఆయనలో చాలా మార్పు చూసానని నన్ను ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా పలకరించారని అది నాకు చాలా సంతోషాన్ని కలిగించదని జేడీ అన్నారు. అయితే ఇన్నేళ్లలో జగన్ లో చాలా మార్పు వచ్చిందని, ఇప్పుడు సీఎంగా ఉన్నరు కాబట్టి తన ప్రవర్తన మరింతగా మారిపోయి ఉంటుందని ఏది ఏమైనా ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌కు నా శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ మాట్లాడారు.