బ్రేకింగ్ : సీఎం జగన్ పై జేడీ ఊహించని వ్యాఖ్యలు.!

Tuesday, June 11th, 2019, 05:58:20 PM IST

ఇటీవలే వచ్చిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ పార్టీ వలన తీవ్రంగా నష్టపోయిన పార్టీలలో జనసేన పార్టీ కూడా ఒకటి.ఈసారి ఎన్నికల్లో మాత్రం పవన్ అనుకున్న స్థాయిలో ఎక్కడా మ్యాజిక్ లు జరగలేదు.అంతే కాకుండా ఖచ్చితంగా గెలుస్తాము అని అనుకున్న చోట్ల ఘోరమైన ఓటమిని వారు చవి చూసారు.ముఖ్యంగా పవన్ మరియు మాజీ జేడీ లక్ష్మి నారాయణ విషయంలో అయితే వీరికి ఓటమి ఉండదు విశాఖ ఎంపీ స్థానానికి క్రాస్ ఓటింగ్ కూడా బలంగా పడిందని తెలియడంతో జేడీ గెలుపు అక్కడ ఖాయమని అంతా అనుకున్నా సరే అక్కడ అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు.

ఇందులో భాగంగా జేడీ ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మరియు ఆయన పరిపాలనపై కొన్ని ఊహించని వ్యాఖ్యలు చేసారు.జగన్ ఇప్పుడే అధికారంలోకి వచ్చినా హర్షణీయమైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుండడం బాగుందని అలాగే వీరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకెలాంటి పనులు చేస్తారో చూడాలని అన్నారు.

అంతేకాకుండా జగన్ చెప్పిన హామీలకు సంబంధించి మధ్య పాన నిషేధ హామీ తనకు బాగా నచ్చిందని ముఖ్యంగా దశల వారీగా నిషేధం చేపట్టి పూర్తిగా 5స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పడం కూడా మంచి నిర్ణయమే అని తెలిపారు.అలాగే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి మరియు ప్రత్యేక హోదా వంటి ఇతర అంశాల్లో కూడా వారి సహాయ సహాకారాలు కూడా ఎప్పుడు ఉంటాయని జేడీ సెలవిచ్చారు.