జేడీ సంచలన వ్యాఖ్యలు : జనసేనాని పాదయాత్ర..?

Friday, June 14th, 2019, 06:16:50 PM IST

గత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను గమనించినట్లయితే పాదయాత్ర చేసిన కీలక రాజకీయ నాయకులు అంతా పాదయాత్ర చేసి ప్రజలకు మరింత చేరువయ్యి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించారు.ఇప్పుడు అదే బాటలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నడవబోతున్నారా అన్న సంకేతాలు ఇప్పుడు వస్తున్నాయి.అలాగే జనసేనాని కూడా గతంలో ఒకసారి తాను కూడా పాదయాత్ర చేస్తానని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు అదే మాటలను నిజం చేసే విధంగా ఆ పార్క్ విశాఖ అభ్యర్థి అయినటువంటి మాజీ జేడీ వివి లక్ష్మి నారాయణ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చిన్న సందిగ్ధంలోకి నెట్టేశారు.ఇంటర్వ్యూల స్పెషలిస్ట్ నాగరాజు అడిగిన ప్రశ్నకు గాను జేడీ తమ పార్టీ అధినేత పవన్ పాదయాత్ర చేస్తే తప్పేముందని ఆయన పాదయాత్ర చేసినట్లతే తాము ప్రజలకు మరింత చేరువవుతామని చిన్న హింట్ ఇచ్చేసారు.దీనిని బట్టి పవన్ రానున్న రోజుల్లో పాదయాత్ర మొదలు పెట్టేందుకు అవకాశాలు ఎక్కువ గానే ఉన్నాయని చెప్పాలి.మరి పవన్ దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూడాలి.