వంగవీటి అసలైన చరిత్రతో సినిమా తీస్తానంటున్న దర్శకుడు

Tuesday, December 27th, 2016, 05:43:45 PM IST

jeeva
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తాజాగా వచ్చిన వంగవీటి సినిమా ఎంత వివాదాస్పదమయ్యిందో అందరికీ తెలిసిందే. వంగవీటి కుటుంబ సభ్యులు, వంగవీటి అభిమానులు రాంగోపాల్ వర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు వర్మకు వంగవీటి గురించి ఏం తెలియకుండానే సినిమా తీసి వంగవీటి అభిమానుల మనోభావాలను దెబ్బ తీసారని మంది పడుతున్నారు. ఈ విమర్శలకు రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేస్తూ వంగవీటి అభిమానులపైన విరుచుకు పడుతున్నారు. వంగవీటి గురించి ఎవరూ వినడానికి కూడా ఇష్టపడని చాలా విషయాలు తన దగ్గర ఉన్నాయని అయితే తనకు రంగా గారి మీద ఉన్న అభిమానంతో వాటిని బయటపెట్టట్లేదని వర్మ అన్నారు. నేను తీసిన సినిమా వాళ్లకు నచ్చకపోతే వంగవీటి గురించి వాళ్లే ఒక సినిమా తీసి చూపించాలని రాంగోపాల్ వర్మ అన్నారు.

వర్మ విసిరిన ఈ సవాలుకు వంగవీటి కుటుంబ సభ్యులు, అభిమానులు స్పందించకపోయినా ఒక దర్శకుడు మాత్రం స్పందించాడు. గతంలో ఫైట్ మాస్టర్ గా చేసి తరువాత దర్శకుడిగా మారి శ్రీకాంత్ హీరోగా రంగ ది దొంగ, నితిన్ హీరోగా హీరో అనే సినిమాలను తీసిన జీవీ వంగవీటి కథతో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి వంగవీటి అసలు చరిత్రతో ఆయన గొప్పదనాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుందని జీవీ అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments