దిశ కేసుపై కీలక వ్యాఖ్యలు.. ఎన్‌కౌంటర్‌ను తప్పుపట్టిన జీవన్ రెడ్డి..!

Wednesday, December 11th, 2019, 01:38:24 AM IST

దిశ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ హత్యకు సంబంధించిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం సరికాదని ఈ కేసుపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే దిశ కేసుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌కు అనుమతిచ్చిన న్యాయస్థానం అన్ని కేసులకు సంబంధించి శాశ్వత ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు.

అయితే దిశ తల్లిదండ్రులు కంప్లెయింట్ ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం వలనే ఈ ఘటన జరిగిందని అన్నారు. అయితే తం అతప్పును కప్పి పుచ్చుకోవడానికే పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేసి చంపారని, పోలీసులే ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఇక న్యాయస్థానాలు ఎందుకని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలకు అసలు ఎన్‌కౌంటర్ అనేది పరిష్కారం కాదని మండిపడ్డారు.