ప్రజాసమస్యలను గాలికొదిలేశారు – జీవన్ రెడ్డి

Friday, September 12th, 2014, 08:06:15 PM IST


తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసమస్యల గురించి పట్టించుకోవడంలేదని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, గత ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోయడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమి లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు కరీంనగర్ లో కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి డి. శ్రీదర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం మరిచిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చామని.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చుసుకున్నామని ఆయన అన్నారు. రుణమాఫీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదని.. సంక్షేమ పధకాలు కుదించే ప్రయత్నం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.