పోలిసుల నిర్లక్ష్యం వల్లే దిశ హత్య, ఎన్కౌంటర్ పరిష్కారం కాదు

Tuesday, December 10th, 2019, 09:12:55 PM IST

దిశ హత్యోదంతం ఫై ఇప్పటికీ తెరాస ప్రభుత్వం ఫై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు తెరాస ప్రభుత్వానికి మద్దతుగా జగన్ చేసిన వ్యాఖ్యల ఫై న విమర్శలు వస్తూనే వున్నాయి. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం వైఫల్యం, పోలిసుల నిర్లక్ష్యం కారణంగానే మహిళల ఫై దాడులు జరుగుతున్నాయని అన్నారు. పోలిసుల నిర్లక్ష్యం కారణం గానే దిశ హత్య జరిగినది అని అన్నారు. అయితే వారి పాపాలకు ఎన్ కౌంటర్ పరిష్కారం కాదని తెలిపారు.

అయితే ఈ విషయం ఫై జీవన్ రెడ్డి కేసీఆర్ ఫై మాత్రమే కాకుండా దానిని సమర్ధించిన జగన్ మోహన్ రెడ్డి ఫై కూడా విమర్శలు గుప్పించారు. దిశ ఘటన ఫై న్యాయ విచారణ జరపాలని, మహిళల ఫై దాడులు జరుగుతున్నా, ఈ తప్పులకి బాద్యులని గుర్తించడం లేదని అన్నారు. తెలంగాణాలో ఎం జరుగుతుందో జగన్ మోహన్ రెడ్డి కి తెలియదు అని అందుకే హ్యాట్సాఫ్ అన్నారు అని ఎద్దేవా చేసారు. అంతేకాదు తెలంగాణ లో మద్యం ఏరులై పారుతుంది దానికి కూడా హ్యాట్సాఫ్ అంటారా అని ప్రశ్నించారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ తెలుగు మీడియం దీనిపై ఏమంటారు అని నిలదీశారు. అంతేకాకుండా దిశ కేసులో ఎం జరిగిందో జగన్ తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉంటే మద్యం అమ్మకాల్లో ఆదాయం పెరగడానికి కేసీఆర్ జవాబివ్వాలని అన్నారు.