జీవిత డాట‌ర్స్‌కి మ‌ణిర‌త్నం గైడెన్స్‌?

Wednesday, September 26th, 2018, 03:11:35 PM IST

ర‌జ‌నీకాంత్, మ‌మ్ముట్టి, ప్ర‌కాష్‌రాజ్, మోహ‌న్‌లాల్, నాగార్జున‌ లాంటి ఎంద‌రో గొప్ప స్టార్ల కెరీర్ లో కీల‌క వ్య‌క్తి మ‌ణిర‌త్నం. అర‌వింద‌స్వామి, అనీల్ క‌పూర్‌, ఆర్‌.మాధ‌వ‌న్‌(స‌ఖి), ప్ర‌స‌న్న‌, నిరోష‌, బేబి షామిలి, కిట్టి ఇంత‌మందిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన దిగ్గ‌జం. స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్‌ని సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసింది ఆయ‌నే. దుల్కార్‌కి ఓకే బంగారం చిత్రంతో సౌత్ అంత‌టా మార్మోగేలా చేశారు. అలాంటి ద‌ర్శ‌కుడు దృష్టి సారిస్తే త‌న భార్యామ‌ణి స్నేహితురాలు అయిన జీవిత కుమార్తెల భ‌విత‌వ్యం ఎలా ఛేంజ‌వుతుందో ఊహించ‌గ‌ల‌రా?

ప్ర‌స్తుతం అందుకు స‌న్నాహాలు సాగుతున్నాయ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. జీవిత రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు ఇద్ద‌రు ర‌త్నాల్లాంటి కుమార్తెలు ఉన్న సంగ‌తి తెలిసిందే. పెద్ద కుమార్తె శివానీ ఇప్ప‌టికే క‌థానాయిక‌గా న‌టించేస్తోంది. త‌దుప‌రి శివాత్మిక క‌థానాయిక‌గా తెరంగేట్రం చేయ‌నుంది. తెలుగు, త‌మిళ్ రెండు చోట్లా ఈ ఇద్ద‌రూ పెద్ద స్టార్లు కావాల‌ని త‌ల్లిదండ్రులు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ త‌ల‌పోస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిన్న‌టిరోజున న‌వాబ్ ప్రెస్‌మీట్‌లో జీవిత సంద‌డి చేయ‌డం చూస్తుంటే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో శివానీ, శివాత్మిక‌లు న‌టిస్తున్నారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. త‌న స్నేహితురాలు సుహాసిని పిలుపుతో అక్క‌డికి విచ్చేశారా? లేక మ‌ణిర‌త్నం ను ఆ ఒక్క సంగ‌తి అడిగేందుకే ఇలా విచ్చేశారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చా మొద‌లైంది. మొత్తానికి మ‌ణి స‌ర్ సాయం చేస్తే చిక్క‌ద‌నుకున్న ఆ స్టార్ డ‌మ్ ఏదో చిక్కి తీరుతుంద‌ని అంతా భావిస్తున్నారు. మ‌రి జీవిత ప్లానింగ్ ఏంటో త‌నే చెప్పాల్సి ఉంటుంది.