థియేటర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న జీవిత

Friday, November 3rd, 2017, 12:07:16 PM IST

అప్పట్లో తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన హీరో రాజశేఖర్ గత కొన్నేళ్లుగా డౌన్ అయినా సంగతి తెలిసిందే. అయితే కెరీర్ క్లోజ్ అయ్యే టైమ్ లో మంచి కథతో వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన పిఎస్వి గరుడవేగా ఈ రోజు విడుదలైంది. అయితే సినిమా చూసినవారంతా రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అని ప్రశంసిస్తున్నారు. మంచి కథాంశం ఉండడంతో అందరికి నచ్చేసింది. అయితే మొన్నటి వరకు సినిమాకు ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో నిర్వహించిన రాజశేఖర్ – జీవిత ఈ రోజు ఒక థియేటర్ దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడ రాజశేఖర్ ని కలవడానికి అభిమానులు ఆసక్తిని చూపారు. సినిమా బావుందని ప్రశంసించడంతో జీవిత భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాను హిట్ చేసినందుకు ప్రేక్షకులకు చాలా కృతజ్ఞతలని ఆమె తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments