షాక్ .. ప్రభాస్ సాహో లో అనుష్క ?

Sunday, January 14th, 2018, 12:54:07 AM IST

బాహుబలి తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ నటిస్తున్నది. అయితే ఇందులో అనుష్క కూడా ఉంటుందని తెగ ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో దర్శకుడు ఓ సెల్ఫీ తీసుకున్నాడు .. ఆ సెల్ఫీలో ఈ సినిమా దర్శకుడు సుజీత్ తో పాటు నటుడు మురళి శర్మ, కెమెరామన్ తో పాటు అనుష్క కూడా ఉండడం విశేషం. దాంతో ఈ సినిమాలో అనుష్క కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయం గురించి యూనిట్ మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు .. అసలు నిజంగా ఈ సినిమాలో అనుష్క నటిస్తుందా లేక .. షూటింగ్ జరుగుతుంటే చూడడానికి వచ్చిందా అన్నది తేలాల్సి ఉంది మరి !!