అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు..!

Sunday, February 19th, 2017, 04:15:54 PM IST


శ్రీదేవి కూతురు జాహ్నవి సినిమాల్లోకి రాకముందే ఆమె వ్యవహారం జోరుగా సాగుతోంది.ఏక్కడ కనిపించినా బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే ఈ భామ ఇటీవల జరిగిన అర్థరాత్రి పార్టీ లో రెచ్చిపోయింది. బాయ్ ఫ్రెండ్ తో కలసి ఆమె చేసిన డాన్స్ సంచలనం గా మారింది. జాహ్నవి ఆమె ప్రియుడు శిఖర్ కలసి పార్టీలో డాన్స్ చేస్తున్న వీడియోని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఆ వీడియోకి విపరీతంగా లైకులు వస్తున్నాయి.

కాగా ఈ అమ్మడు సినిమాల్లోకి రాకముందే ఈ రేంజ్ లో రెచ్చిపోవడం పై బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.ఇప్పుడే ఇలా ఉంటె ఇక సినిమాల్లోకి వచ్చాక ఇంకెలా అందాలు ఆరబోస్తుందో అని చర్చించుకుంటున్నారు. కాగా ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ చిత్రంలో ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.