ఎట్టకేలకు లొంగిపోయిన జేఎన్‌యూ విద్యార్థి నాయకులు

Wednesday, February 24th, 2016, 12:11:03 PM IST

jnu-umar-khalid
జేఎన్‌యూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య మంగళవారం రాత్రి గం.11:45 ల సమయంలో పోలీసులకు లొంగిపోయారు. వీరిద్దరూ కూడా కన్హయ్య కుమార్ తో పాటు జాతి వ్యతిరేక నినాదాలు చేశారని, అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కన్హయ్య అరెస్టు తరువాత నుండి కనిపించకుండాపోయిన వీరిద్దరూ గత ఆదివారం యూనివర్శిటీలో ప్రత్యక్షమయ్యారు. కానీ వర్శిటీలోకి అనుమతి లేకపోవడంతో పోలీసులు వాళ్ళను అరెస్టు చెయ్యలేకపొయ్యారు. ఇంతలో విద్యార్థులే కన్హయ్య కుమార్ పై జరిగిగినట్టే తమపై కూడా దాడి జరుగుతుందన్న అందోళనతోనే బయటకు రాలేదని.. ఓ రహస్య ప్రాంతంలో లొంగిపోతామని కోర్టుకు తెలిపారు.

కానీ డీసీపీ ప్రేమనాథ్ వాళ్ళు చెప్పిన ప్రాంతం తమ కంట్రోల్ లో లేదని.. భద్రత కల్పించడం కష్టమని కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు కూడా పోలీసులకు అనువైన చోట లొంగిపోవాలని లేదంటే పొలీసులే అరెస్టు చేస్తారని తెలిపింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య నిన్న రాత్రి ఇద్దరు విద్యార్థులు వర్శిటీ నుండి బయటకొచ్చి పోలీసులకు లొంగిపొయ్యారు. పోలీసులు వాళ్ళను రహస్య ప్రదేశానికి తరలించారు.