ఆ హీరోకి తిక్క‌, పొగ‌రు! క‌ర‌స్టే!?

Wednesday, April 4th, 2018, 11:58:03 PM IST

సినిమా ఔట్‌పుట్ స‌వ్యంగా రావాలంటే హీరో – ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య సింక్ ప‌క్కాగా కుద‌రాలి. లేదంటే ఆ సినిమా అధోఃగ‌తి పాల‌వుతుంద‌నడానికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌లెన్నో. ఇలాంటి వివాదాల మ‌ధ్య న‌లిగిపోయి కొన్ని సినిమాలు రిలీజ్‌కి నోచుకోక ల్యాబుల్లో మూలిగిన స‌న్నివేశం ఉంది. బాలీవుడ్‌లో అలాంటిదే ఈ వివాదం.

కండ‌ల హీరో జాన్ అబ్ర‌హాం ప్ర‌స్తుతం `ప‌ర‌మాణు` అనే ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకి స‌హ‌నిర్మాతగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ చాలా వ‌ర‌కూ పూర్త‌యింది. అయితే ఈలోగానే ఏమైందో జాన్‌కి, క్రై అర్జ్ సంస్థ అధినేత కం చిత్ర‌ నిర్మాత ప్రేర‌ణ అరోరాకి మ‌ధ్య గొడ‌వ‌లు త‌లెత్తాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ మొద‌లై, చినికిచినికి గాలివాన‌లా త‌యారైంది. ఆ క్ర‌మంలోనే ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఇలాంటి బిజినెస్ ట్రేడ‌ర్స్ సినిమాల్లోకి ఎందుకొస్తారు? అస‌లు ప‌రిశ్ర‌మ‌తో ఏ సంబంధం లేని వాళ్లు.. అంటూ తిట్టి పారేశాడు జాన్ అబ్ర‌హాం. అందుకు ఎంతో ఎమోష‌న్ అయిన ప్రేర‌ణ అరోరా.. నువ్వే ఔట్ సైడ‌ర్‌. క‌నీసం హిందీ ఒక ముక్క కూడా స‌రిగా మాట్లాడ‌డం రాని నువ్వు బాలీవుడ్‌లో ఎందుకు ప్ర‌వేశించావ్‌? అని ప్ర‌శ్నించింది. నా తండ్రి నిర్మాత‌. ద‌శాబ్ధాలుగా ఇదే రంగంలో మా ఫ్యామిలీ కొన‌సాగుతోంది. నేను సినిమాల్లోనే పుట్టి పెరిగాను. నేనెలా ట్రేడ‌ర్‌ని అవుతాను.. అని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. జాన్ అబ్ర‌హాం ఎంతో రూడ్‌. ఎన్నోసార్లు మ‌న‌సు గాయ‌ప‌డేలా కించ‌ప‌రిచాడ‌ని, వాట‌న్నిటినీ సినిమా కోస‌మే భ‌రించాన‌ని లేడీ ప్రొడ్యూస‌ర్ తెలిపారు. 35 కోట్ల పారితోషికంలో 33కోట్లు జాన్‌కి చెల్లించేశాను. 2కోట్లు పెండింగులో ఉంది. అయినా అత‌డు స‌తాయిస్తున్నాడు.. అంటూ ఆవేద‌న చెందారు ప్రేర‌ణ‌. మొత్తానికి బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా భావిస్తున్న `ప‌ర‌మాణు` ప‌రిస్థితి క్రైసిస్‌లో ప‌డింది. ఇక ఈ చిత్రానికి జాన్ భాయ్ స‌హ‌నిర్మాత‌గా కొన‌సాగుతున్నందున‌, ఆర్థిక వ్య‌వ‌హారాల్లో, ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల్లో గొడ‌వ‌లు త‌లెత్తాయ‌ని అర్థ‌మ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments