సెల్ఫీ అడిగినందుకు చెంప ఛెళ్లుమ‌నిపించిన హీరో

Friday, September 30th, 2016, 10:42:22 PM IST

john-abhram1
స్టార్ల‌ని సెల్ఫీల గోల రోజు రోజుకీ ఇబ్బందిపెడుతోంది. స్టార్ట్ ఫోన్లొచ్చాక ప్ర‌తి ఒక్క‌రూ ద‌గ్గ‌రికొచ్చి సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు. ఇదివ‌ర‌కు అభిమాన న‌టులు ఎదురుగా ఉన్నారంటే వారి ప‌క్క‌కెళ్లి ఎంచ‌క్కా నిలుచుని ఓ ఫొటో తీయించుకొనేవారు. దాంతో ఎవ్వ‌రికీ ఇబ్బంది ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం సెల్ఫీ అంటూ హీరోహీరోయిన్ల‌ని రాసేసుకొంటున్నారు ఫ్యాన్స్‌. దీంతో న‌టీన‌టులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఆ సంద‌ర్భంలో కొద్దిమంది హీరోయిన్ల‌తో అస‌భ్యంగా కూడా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ట‌. దీంతో తార‌లు కోపంతో ఫ్యాన్స్‌పై చేయి కూడా చేసుకొంటున్నారు. తాజాగా బాలీవుడ్‌కి చెందిన జాన్ అబ్ర‌హామ్ కూడా ఓ అభిమాని చెంప
ఛెళ్లుమ‌నిపించాడ‌ట‌. ఫోర్స్‌2 సినిమాకి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొని వెళుతుండగా, జాన్ అబ్ర‌హామ్ ద‌గ్గ‌రికి వెళ్లి చేయి ప‌ట్టి లాగి సెల్ఫీ అడిగాడ‌ట ఓ అభిమాని. దీంతో జాన్‌కి కోపం న‌షాళానికి అంట‌డంతో వెంట‌నే చెంప ఛెళ్లుమ‌నిపించాడ‌ట‌. దీంతో మీడియా కూడా ప‌రిగెత్తుకొచ్చిందట‌. ఈ వ్య‌వ‌హారాన్ని ఇంత‌టితో వ‌ద‌లేయ‌మ‌ని మీడియా ప్ర‌తినిధుల‌కి చెప్పి వెళ్లిపోయాడ‌ట జాన్‌. ఇప్పుడు ఆ విష‌యం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.