‘భరత్ అనే నేను’ పై జేపీ ప్రసంశలు!

Monday, April 30th, 2018, 05:46:48 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఇటీవలి సూపర్ హిట్ చిత్రం భరత్ అనే నేను. తొలి రోజునుండి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. కాగా నేడు ఈ చిత్రం వీక్షించిన లోక్సత్తా పార్టీ అధినేత జయ ప్రకాష్ నారాయణ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, నేడు నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసాను. ప్రజలని ఆలోచింపచేసే అంశాలు, అలానే స్థానిక పరిపాలన అనే అంశంపై కొరటాల సినిమా తెరకెక్కించిన విధానం బాగుందన్నారు.

అలానే స్థానికంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో, వాటి ప్రభావం ఖచ్చితంగా స్థానికులపై వుంటాయని, అప్పుడే ప్రజలు వోటింగ్, తమ జీవితాలు, సేవలు, పన్ను తదితరాల మధ్య గల తేడా అర్ధం చేసుకుంటారని అన్నారు. ప్రస్తుతం నేతలు లోకల్ గవర్నెన్స్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కానీ కొరటాల ధైర్యంతో తీసిన ఈ చిత్రానికి కుడోస్ అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఆయన మాటలకు స్పందించిన కొరటాల, మీలాంటి గొప్ప వ్యక్తి నుండి ప్రసంశలు దక్కడం గొరవంగా భావిస్తున్నానని, మెరుగైన సమాజం ఏర్పాటులో మీలాంటి వారి యొక్క అవసరం చాలా ఉందని అన్నారు. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ అని తేడా లేకుండా అన్నిచోట్లా కలెక్షన్ ల ప్రభంజనం సృష్టిస్తున్న ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు కొల్లగొడుతుందో వేచిచూడాలి……

image.png

  •  
  •  
  •  
  •  

Comments