ట్రైలర్ కు డబ్బింగ్ పూర్తి చేసిన “అరవింద్” సమేత..!

Thursday, September 13th, 2018, 07:43:20 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ” త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం నుంచి ఇటీవలే కొత్త పోస్టర్లను కూడా విడుదల చేశారు.త్రివిక్రమ్ సినిమాల్లో ఇంతవరకు ఇంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న చిత్రం ఇదే కావచ్చు. అయితే తాజాగా ఈ చిత్రం కోసం కొత్త వార్త ఒకటి తెలిసింది.

ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ముందే ప్రకటించారు. దీనితో ఈ చిత్రం షూటింగును వేగంగా పూర్తి చేస్తున్నారు.ముందు టీజర్ తో జూ.ఎన్టీఆర్ యూట్యూబ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించాడో అందరికీ తెలిసినదే ఐతే ఇప్పుడు తన చిత్రం ట్రైలర్ కోసం తన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు సమాచారం. ఈ టీజర్ ని ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతానికి ట్రైలర్ కి డబ్బింగ్ ముగించిన తారక్ తర్వాత పూర్తి డబ్బింగ్ మీద దృష్టి పెట్టనున్నాడు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments