త్రివిక్రమ్ కోసం తారక్ న్యూ లుక్

Tuesday, October 31st, 2017, 02:54:48 PM IST

త్రివిక్రమ్ సినిమాలంటే ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాసుకున్న కథలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా త్రివిక్రమ్ కథను రాసుకుంటారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తోన్న సినిమా కూడా అదే తరహాలో ఉంటుందట. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆ సినిమాను చూసేందుకు చాలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇకపోతే త్రివిక్రమ్ పవన్ తో సినిమాను పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఇటీవల ఆ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా గురించి మరొక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. సినిమాలో ఎన్టీఆర్ ఎప్పుడు కనిపించని స్టైల్ లో కనిపించబోతున్నాడట. ఫిట్ గా ఉండి స్మార్ట్ లుక్ తో కనిపించాలని త్రివిక్రమ్ చెప్పాడట. మొత్తంగా క్లాస్ లుక్ గా ఉండాలని చెప్పడంతో తారక్ ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతే కాకుండా ఆ లుక్ ని సీక్రెట్ గా ఉంచాలని కూడా అనుకుంటున్నారట. చూద్దాం తారక్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో..

  •  
  •  
  •  
  •  

Comments