ఎన్టీఆర్ కొత్త సినిమా కథ ..లీకయిందా ?

Tuesday, January 31st, 2017, 09:22:17 AM IST

NTR-NEW
వరుస పరాజయాల తరువాత ”టెంపర్” తో కాస్త రిలాక్స్ అయ్యాడు ఎన్టీఆర్ .. ఇక ఆ తరువాత వచ్చిన ”జనతా గ్యారేజ్” తో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుని ఏకంగా యాభై కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి పదిన మొదలు కానుంది. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ”జై లవకుశ” అని పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. టైటిల్ ని బట్టి చుస్తే జై, లవ , కుశ అంటూ ముగ్గురు ఉంటారని తెలుస్తోంది. ఈ సినిమా కథ కూడా ముగ్గురు అన్నదమ్ముల కథ అని .. చిన్నప్పుడే అనుకోని పరిస్థితుల్లో విడిపోయిన వీరిలో ఒకడు చెడ్డ వాడిగా మారాడని .. అంటున్నారు .. మరి ఇందులో ఎంత నిజం ఉందొ కానీ, ఎన్టీఆర్ సినిమా కథ లీక్ అయిందంటూ జరిగే ప్రచారం మాత్రం జోరుగా ఉంది.