ఎన్టీఆర్ విమర్శలు ఒకే! కాస్తా లెక్కలు చూసుకోండి!

Tuesday, September 26th, 2017, 04:50:33 PM IST


తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య ఒక సమస్య వచ్చింది. అది సినిమా వాళ్ళకి, సినిమా విమర్శకులతో వచ్చిన సమస్య, హీరోలు, దర్శకులకి, సినిమాని క్రిటిక్ చేసే వారి మధ్య వచ్చిన సమస్య. ఇంతకి సమస్య ఏంటంటే. ఒక వెబ్ సైట్ లో, లేదా పత్రికలో ఒక సినీ విమర్శకుడు, సినిమా చూసిన తర్వాత రివ్యూ రాస్తాడు. అందులో పోజిటివ్స్ రాస్తా, నెగిటివ్స్ రాస్తాడు. సినిమా బలం, బలహీనతని స్పష్టంగా ఎత్తి చూపిస్తాడు. చివరికి సినిమాకి ఎంతో కొంత రేటింగ్ ఇస్తాడు. ఇదంతా భాగానే ఉంది. మరి అలాంటి సమయంలో విమర్శకులని విమర్శించాల్సిన అవసరం ఏంటి? అంటే అది వారికే తెలియాలి. ఎందుకంటే విమర్శించేది హీరోలు, దర్శకులే కాబట్టి, ఆ మధ్య దువ్వాడ జగన్నాదమ్ సినిమా గురించి ప్రస్తావించినపుడు సినిమాలో అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదని, రొటీన్ కమర్షియల్ సినిమా అని చెప్పారు. అదే సమయంలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ బాగుంది, అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ పాయింట్ అవుట్ చేసింది కథ, కథనం గురించి మాత్రమె అందులో చేసిన హీరో గురించి కాదు. అలాగే తాజాగా జై లవకుశ సినిమా విషయంలో కూడా చాలా మంది తమ రివ్యూ లో కథ, కథనం గురించి ప్రస్తావిస్తూ రొటీన్ కమర్షియల్ స్టొరీ, కథలో గాని, కథనంలో గాని ఎలాంటి గొప్పతనం లేదు. ఒక సాదాసీదా కథనం అంటూ ప్రస్తావించారు. అయితే సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో ప్రేక్షకుడుని కట్టిపడేస్తాడు అని కూడా రాసారు.

అప్పట్లో అల్లు అర్జున్ ఇలా రివ్యూలు రాసే వారిని విమర్శిస్తూ వాళ్ళకి అసలు సినిమా గురించి కనీసం జ్ఞానం లేదు అన్నట్లు మాట్లాడారు. సినిమా అంటే ఎవరికీ అర్ధం కాని ఏదో బ్రహ్మ పదార్ధం అనే విధంగా చెప్పడంలో అసలు గొప్పతనం ఏంటో అర్ధం కాని విషయం. ఒక క్రిటిక్ అనేవాడు ఇప్పుడు కావాలని తప్పులు ఎత్తడానికి సినిమా చూడడు, అతను చూసేది కూడా కామన్ ఆడియన్ పాయింట్ అఫ్ వ్యూ నుంచే. అలా చూసిన తర్వాత తనకు ఎం అర్ధమైందో దానిని బట్టి రివ్యూ రాస్తాడు. నిజానికి సిని విమర్శకులు చేబున్నట్లు ఈ మధ్య తెలుగు కమర్షియల్ సినిమాల్లో గొప్ప కథలు అయితే రావడం లేదు. రొటీన్ స్టొరీని అటు ఇటు తిప్పి మెప్పించాలని ప్రయతిస్తున్నారు. ఆ ప్రయోగాలు బెడిసికోడుతున్నాయి. ఇప్పుడు జై లవకుశ సినిమా మీద వచ్చిన విమర్శల గురించి కూడా తారక్ అలాగే ప్రస్తావించాడు. సినిమాని ఒక పేషెంట్ తో పోలుస్తూ, పేషెంట్ బ్రతకడు అని ఆపరేషన్ చేయకుండానే చెప్పేస్తే ఎలా అంటూ మాట్లాడాడు. సినిమా గురించి ఎవరికీ నోటికొచ్చినట్లు వారు మాట్లాదేస్తే సినిమా పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించాడు. ఇక్కడ గుర్తుంచుకోవాలైన విషయాలు కొన్ని ఉన్నాయి. జై లవకుశ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ యాక్టింగ్ ని ఎవరు వేలెత్తి చూపించలేదు. కేవలం, కథ, కథనాలతో మెప్పించలేకపోయిన దర్శకుడు ప్రతిభ గురించి మాత్రమె చెప్పారు. నిజానికి జై లవకుశ అంత గొప్ప కథ అయితే కాదు. ఆ కథనంలో అద్బుతమైన ఎమోషన్స్ కూడా, ఒక నాన్నకు ప్రేమతో, ఒక జనతా గ్యారేజ్, ఒక టెంపర్ సినిమాలతో పోల్చి చూస్తే ఒక్క ఎన్టీఆర్ యాక్టింగ్ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో జై లవకుశ వెనుక స్థానంలోనే ఉంటుంది. ఇది ఎవ్వరు కాదనలేని నిజం. ఆ సినిమాల గురించి పోజిటివ్ గా రాసినపుడు ఎవరికీ ఇబ్బంది అనిపించలేదు. అలాంటిది జై లవకుశ సినిమా దగ్గరకు వచ్చేసరికి అందులో తప్పులు ఎత్తి చూపిస్తే ఎన్టీఆర్ అసహనానికి గురి కావడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రశ్న.

  •  
  •  
  •  
  •  

Comments