యంగ్ టైగర్ ఈసారి అయినా బ్రేకీవెన్ ఇస్తాడా..?

Wednesday, September 26th, 2018, 05:26:01 PM IST

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న ప్రేక్షకాదరణ భిన్నమనే చెప్పాలి.తన మాస్ ఇమేజ్ తో బాక్సాఫీస్ రికార్డులను నమోదు చెయ్యగలడు మన తారక్ అయితే టాక్ ఎలా ఉన్నా సరే మొదటి రోజు మాత్రం రికార్డు స్థాయిలోనే వసూళ్లను రాబట్టగలడు కానీ పూర్తి రన్ లో మాత్రం బ్రేకీవెన్ ఇచ్చిన చిత్రాలు మాత్రం ఎన్టీఆర్ కెరీర్లో తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి.

ఈ మధ్య కాలంలో తాను నటించిన జనతా గ్యారేజ్ మినహా మిగతా ఏ చిత్రాలు ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాడు.సినిమా హిట్టయినా సరే బ్రేకీవెన్ ఇవ్వలేడు అన్న ఒక్క చిన్న మచ్చ అయితే తారక్ మీద ఉండిపోయింది,దానికి ఉదాహరణగా తన కెరీర్ ప్లాపుల్లో ఉన్నపుడు విడుదలైన టెంపర్ చిత్రం అద్భుత విజయాన్ని అందించినా కొన్ని ఏరియాల్లో నష్టాన్నే మిగిల్చింది అని,చిత్ర నిర్మాత బండ్ల గణేషే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు,నాన్నకు ప్రేమతో పరిస్థితి కూడా అంతే,అంతెందుకు అన్ని అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సంతరించుకున్న జై లవ కుశ చిత్రం కూడా అన్ని ఏరియాల్లో లాభాలను అందించలేకపోయింది.

కానీ అరవింద సమేత చిత్రానికి సంబందించిన టీజర్ పాటలకు వస్తున్న అద్భుత స్పందన చూస్తుంటే ఈ చిత్రం కొత్త రికార్డులను నెలకొల్పేలా ఉంది.ఎన్టీఆర్ డైలాగ్ డెలివెరీకి త్రివిక్రమ్ మాటలు తోడయ్యి సినిమా మాత్రం హిట్ టాక్ సంతరించుకుంటే మాత్రం ఈ సారి తారక్ ఖచ్చితంగా అన్ని చోట్లా లాభాలను అందిస్తాడు.